అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నిర్మితమవుతున్న “సరిలేరు నీకెవ్వరూ” సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ డిసెంబర్ మొదటి వారంలో మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ సినిమా కథాంశానికి వస్తే ఆర్మీలో ఉండే హీరో తన కుటుంబం కోసం కర్నూల్ వచ్చి ఎలా తన ఫ్యామిలీని కాపాడుకున్నాడు అనే ప్రధానాంశంతో రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ ఆకట్టుకోవడంతో పాటు సెకండ్ హాఫ్ లో మంచి మంచి కామెడీ ఉంటుందని చెబుతున్నారు.

ఈ సినిమా తరువాత మహేష్ బాబు ఇంతవరకు తన తదుపరి సినిమాపై క్లారిటీ రాలేదు. “మహర్షి” సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేష్ బాబు సినిమా ఉంటుందని అనుకున్నా సరైన స్క్రిప్ట్ ఇంతవరకు సిద్ధం కాకపోవడంతో ప్రస్తుతానికి పక్కన పెట్టారు. మహేష్ బాబుకు అనిల్ రావిపూడి మరొక కథ సిద్ధం చేశాడని, మహేష్ ఒప్పుకుంటే దానిని పట్టాలెక్కించడానికి అనిల్ సిద్ధంగా ఉన్నాడట. ఒకవేళ అనిల్ రావిపూడి సినిమా కథ నచ్చితే బ్యాక్ టు బ్యాక్ ఒకే డైరెక్టర్ తో రెండు సినిమాలు చేసిన హీరోగా మహేష్ బాబు నిలిచిపోతాడు.

కానీ అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కాలంటే ముందుగా “సరిలేరు నీకెవ్వరూ” సినిమా రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమాపై మంచి నమ్మకంతో ఉండటంతో ఒకేరోజు అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలు ‘అల వైకుంఠపురం, సరిలేరు నీకెవ్వరూ” సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రేక్షకులు ఏ సినిమాకు బ్రహ్మరధం పడతారో చూడాలి.