మహేష్ బాబు ఎప్పుడు మాట్లాడుతాడు తనకు రాజకీయాల గురించి తెలియదని తన బావ గళ్ళ జయదేవ్ అంటే తనకు ఇస్తామని అతను రాజకీయాలలో మంచి సేవ చేస్తున్నాడని ఇలా అనేక వ్యాఖ్యలు ఎప్పుడు చేస్తుంటాడు. “సరిలేరు నీకెవ్వరూ” సినిమాకు సంబంధించి మహేష్ బాబు అనేక ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా మహేష్ బాబు చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది.

మహేష్ బాబును మీరు ఒక రోజు ముఖ్యమంత్రి అయితే తొలుత మీరు చేసే పనేమిటని అడిగితే తనకు తెలియదని సమాధానం చెబుతూ ఇప్పుడు రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలని చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగా మారుతున్నాయి. ఏపిల్ ప్రభుత్వం రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ బాబుకి ఇష్టం లేక ఇలాంటి వ్యాఖ్యలు చేసాడని అనుకోవచ్చా?

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ హీరోకు అమరావతిలో భూములు ఉన్నాయని గతంలో అనేక వార్తలు వచ్చాయి. ఆ ప్రముఖ హీరో మహేష్ బాబు లేదా పవన్ కళ్యాణ్ అయి ఉండవచ్చని వ్యాఖ్యలు వచ్చాయి. గల్లా జయదేవ టీడీపీ ఎంపీ కావడంతో ఆ ప్రముఖ హీరో మహేష్ బాబు అయ్యి ఉండవచ్చునని ఇప్పుడు అక్కడ నుంచి రాజధాని మరొక ప్రాంతానికి తరలిస్తే తన భూముల తగ్గుతాయన్న భావనతోనే ఇప్పుడు రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని జగన్ గురించి మట్లాడాడని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  
  •  
  •