సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరూ’. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారం నుండి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరగనుంది. ఈ సినిమా మూడవ షెడ్యూల్ కోసం రామోజీ ఫిలిం సిటీలో కర్నూల్ కొండారెడ్డి బురుజు సెట్ నిర్మిస్తున్నారు. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారు.

ఇక ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. గుంటూరు ఏరియా థియేట్రికల్ హక్కులను ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ దక్కించుకున్నారు. ఆయన భారీ ధరకి ఈ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కాగా స్టార్మె హీరోలతో మొహర్ రమేష్ తీసిన సినిమాలన్నీ వరుసగా పరాజయం పొందిన సంగతి తెలిసిందే.

ఇక మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో రస్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  
  •  
  •