సూపర్ స్టార్ మహేష్ 40 పదులు ధాటి నాలుగేళ్లు అవుతున్నా అతడి అందం చూసి యువత మైమరిచిపోతూనే ఉంటుంది. ఇక లాక్ డౌన్ వేళలో తన కుమారుడితో కలసి దిగిన ఫోటోలలో అయితే తన కొడుకు గౌతమ్, కూతురుతో పోటీ పడేలా చాలా యంగ్ గా కనపడ్డాడు. దీనంతటికి కారణం అతడి భార్య నమ్రత అని చెప్పక తప్పదు. ఆమె ఎప్పటికప్పుడు మహేష్ బాబు ఫిజిక్ పై దృష్టి పెట్టి బాలీవుడ్ స్పెషలిస్ట్ లతో మహేష్ ను అందంగా తీర్చిదిద్దుతుంది.

మహేష్ బాబుకి మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు అతడి ట్విట్టర్ అకౌంట్ సమాధానం చెబుతుంది. ఇప్పటివరకు సౌత్ సినీ స్టార్లు ఎవరు సాధించలేని 10 మిలియన్ల ఫీట్ ను దాటేసారు. ట్విట్టర్ లో కోటి మంది ఫాలోవర్స్ దాటడంతో అతడి అభిమానులు ట్విట్టర్ లో ట్రేండింగ్ చేసేస్తున్నారు.

ఈ ఏడాది మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి హిట్ సాధించగా త్వరలో “సర్కార్ వారి పాట” అనే వెరైటీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను “గీత గోవిందం” ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే మొదలు కావాల్సి ఉన్నా కరోనా దెబ్బకు షూటింగ్స్ బంద్ ఐపోయాయి. త్వరలో షూటింగ్స్ జరుపుకునే దిశగా సినీ ఇండస్ట్రీ అడుగులేస్తున్నా మహేష్ బాబు మరికొన్నాళ్లు వేచి చూడాలని భావిస్తున్నారట.