లాక్ డౌన్ నేపథ్యంలో మహేష్ బాబు పూర్తిగా తన సమయాన్ని తన కుటుంబసభ్యులతో గడపడంతో పాటు తన కూతురు సితార, కొడుకు గౌతమ్ తో సందడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కొద్ది సేపటి క్రితం మహేష్ బాబు తన కూతురు సితారతో కలసి అద్దం ముందు దిగిన సెల్ఫీని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు.

ఈ ఫొటోలో మహేష్ బాబు మరింత హ్యాండ్సమ్ గా కనపడటంతో అభినులు మహేష్ బాబు ఫోటోను వైరల్ గా మార్చేశారు. మహేష్ బాబు వయస్సు పెరుగుతున్న కొద్ది అతడి అందం రోజు రోజుకి రెట్టింపవుతుందని మహేష్ బాబు పెట్టిన ఫోటోకి కామెంట్స్ చేస్తున్నారు. గత సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా వచ్చిన “సరిలేరు నీకెవ్వరూ” మంచి హిట్ సాధించడంతో తన తదుపరి సినిమాగా గీత గోవిందం సినిమా ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా ఇప్పటికే మొదలుకావలసి ఉన్నా లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అయింది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఆ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తుంది.

లాక్ డౌన్ నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లడం లేదట

1100 కిలోమీటర్లు ప్రయాణించిన ఓ మొసలి

‘సర్కార్ వారి పాట’ పాడుతున్న మహేష్ బాబు..!