మహేష్ బాబు కొత్తగా క్లాత్ బ్రాండ్ ఏర్పాటు చేసి వ్యాపారం మొదలుపెట్టనునట్లు తెలుస్తుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ “రౌడీ వేర్” బ్రాండ్ టీ షర్ట్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. యూత్ కూడా “రౌడీ వేర్” టీ షర్ట్స్ కోసం ఆన్లైన్ వేదికగా హాట్ కేకులులా కొంటున్నారు. వెటరన్ హీరోయిన్ ఛార్మి కూడ ఇప్పటికే “ఇష్మార్ట్ శంకర్” సినిమా సక్సెస్ తో “ఇష్మార్ట్ కలెక్షన్స్” పేరుతో ఎంటర్ అయింది.

ఇక ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే బాటలో నడవనుండటంతో విజయ్ బాటలో మహేష్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటికే ఒక ఈ-కామెర్స్ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నాడట. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఇప్పటికే ఒక క్లాత్ బ్రాండ్ తో మార్కెట్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు… సల్మాన్ ఖాన్ చేత తన బ్రాండ్ ను ఓపెన్ చేయించేలా ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి. ఈ కొత్త బిజినెస్ తో మహేష్ బాబు ఎంత సక్సెస్ అవుతాడో చూడాలి.
  •  
  •  
  •  
  •  
  •  
  •