‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గీత గోవిందం’ ఫేం పరుశురాం దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక లాక్ డౌన్ సమయంలో పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిన పరుశురాం.. ఈ సినిమాకు డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేసాడట. ఈ సినిమాకు ‘సర్కార్ వారి పాట’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

ఇక మహేష్ బాబుకి కూడా ఈ సినిమా టైటిల్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కరోనా వైరస్ కు కొత్త రకం చికిత్స.. భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి

గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో కరోనా వ్యాక్సిన్ తయారీ.. విజయవంతమైన క్లినికల్ ‌ ట్రయల్స్‌..!