సినిమా ఇండస్ట్రీలో కథలు అలానే ఉంటాయి, ఒకరిని నొక్కాలంటే మరొక హీరోను తెరమీదకు తీసుకురావడం కొత్తగా జరిగే విషయం ఏమి కాదు. తరతరాలుగా వస్తున్నదే. ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్ ఎన్టీఆర్ కు చోటుచేసుకుందట. ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కరోనా వైరస్ నేపథ్యంలో ఆగిపోవడంతో ఇప్పుడిప్పుడే షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటుండటంతో మరొక ఆరేడు నెలలు ఎన్టీఆర్ మరొక సినిమాపైకి వెళ్లే సూచనలు కనపడటం లేదు. కరోనా కనుక లేకపోతే ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొనేవాడు. కానీ ఇప్పుడు మరొక ఆరేడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది.

కానీ త్రివిక్రమ్ గత సంక్రాంతికి అల్లు అర్జున్ హీరోగా “అల వైకుంఠపురంలో” సినిమా ముగియడంతో ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. ఎన్టీఆర్ తొ సినిమా కోసం కథ చర్చలు కూడా మొత్తం ముగించి డైలాగ్స్ పై కూడా ఎన్టీఆర్ తొ అనేక సిట్టింగ్స్ నడిచాయి. కానీ ఎన్టీఆర్ మరొక ఆరేడు నెలలు డేట్స్ ఇచ్చే సూచనలు లేకపోవడంతో ఈ ఖాళీ సమయంలో మరొక సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట. దీనిపై హారిక హాసిని సంస్థ నేరుగా ఎన్టీఆర్ తొ మాట్లాడాలని అనుకున్నా అడిగితే ఏమంటాడో అనే ఆలోచనలు ఉన్నారట.

దీనితో ఎన్టీఆర్ ను గిల్లె పనిలో భాగంగా మహేష్ బాబుతో, రామ్ చరణ్, వెంకటేష్ ఇలా పలువురితో కథ చర్చలు జరుగుతున్నాయని ఫీలర్లు వదిలారట. ఈ విషయం ఎన్టీఆర్ కు తెలిసినా వాళ్ళు అడిగితే అప్పుడు చూద్దాంలే అనే రీతిలో అతడు సైలెంట్ గా ఉన్నాడు. కానీ ఇప్పటికే త్రివిక్రమ్ హీరో వెంకటేష్ కోసం ఒక కథ సిద్ధం చేసుకున్నాడు. ఈ ఆరేడు నెలలో చకచకా వెంకటేష్ తొ సినిమా ముగించేసి అప్పుడు ఎన్టీఆర్ సినిమాపైకి రావచ్చని కోరిక, కానీ ఎన్టీఆర్ ఏమనుకుంటాడో అనే భయం. ఈ వ్యవహారం ఇలా నడుస్తుంటే వాళ్ళ ప్లాన్స్ వర్క్ అవుట్ చేసుకోవడానికి మహేష్ బాబు పేరు వాడుకుంటున్నారని మహేష్ టీమ్ కామెంట్ చేస్తుందట.