‘మహర్షి’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మంచి జోష్ మీద ఉన్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కాశ్మీర్ షెడ్యూల్ శుక్రవారంతో పూర్తయింది. జులై 20న కుమార్తె సితార బర్త్ డే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు మహేష్ బాబు.

సితార 7వ బర్త్ డే సందర్భంగా తన కూతురు పుట్టిన దగ్గర నుండి అన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసాడు.కాలం చాలా వేగంగా పరుగులు తీస్తుంది. నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో ప్రత్యేకం. నీ జీవితం ప్రేమ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నానని.. నీవు ఊహించిన దాని కంటే నిన్ను ప్రేమిస్తున్నానని పోస్ట్ చేశారు మహేష్.

ఇదే సందర్భంగా నమ్రత కూడా సితారను విష్ చేశారు. ప్రస్తుతం నమ్రత, సితార, గౌతమ్ కాశ్మీర్ లోనే ఉన్నారు. సితార బర్త్ డే సందర్భంగా వీరంతా అక్కడికి వెళ్లారు.

sithara birth day
  •  
  •  
  •  
  •  
  •  
  •