నగ్నంగా డాన్స్ చేయాలనీ కోరుతూ నలుగురు యువకులు ఓ మహిళపై దాడి చేశారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో ఓ మహిళ ఆర్గనైజర్ గా పనిచేస్తుంది. పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అమీర్ అనే యువకుడు సదరు మహిళను సంప్రదించాడు. ఈ నెల 22న రాత్రి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఆ రాత్రి వేడుకలు ముగిసిన తరువాత మద్యం సేవించిన అమీర్, అతని మిత్రులు సుల్తాన్, సలీం, రాజ్ అలీ నగ్నంగా డాన్స్ చేయాలంటూ మహిళను బలవంత పెట్టారు. ఆమె నిరాకరించడంతో కత్తులతో భెదిరించి ఓ గదిలో బంధించారు. ఇక ఆ రాత్రంతా గదిలోనే ఉన్న సదరు మహిళ 23 తేదీన తన భర్తతో కలసి రాజేంద్రనగర్ ఠాణాలో పిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుల కోసం గాలిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •