తెలుగుదేశం పార్టీలో ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ కొంత మంది అసమ్మతి నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. ఇందులో భాగంగానే చితూర్ జిల్లా పీలేరుకు చెందిన సీనియర్ నేత మహ్మద్ ఇక్బల్ టీడీపీ పార్టీకి రాజీనామా చేసారు. అతనితో పాటు నియోజకవర్గంలో కీలకంగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే మరో 20 మంది కూడా మహ్మద్ ఇక్బల్ తో నడవనున్నారు. పీలేరు నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా పార్టీ కోసం ఎన్ని సేవలు చేసినా తనను చంద్రబాబు నాయుడు గుర్తించకపోగా అవమానానికి గురి చేసారని మహ్మద్ ఇక్బల్ అంటున్నారు.

కొట్తగా పార్టీలోకి వచ్చిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి పీలేరు ఇంచార్జి పదవితో పాటు నామినేటెడ్ పదవిని కూడా అప్పగించడంతో ఇక్బల్ అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తుంది. పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అందలం ఎక్కించడం ఎంత వరకు సబబని, గతంలో చంద్రబాబు నాయుడుకి గతంలో తాను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పిన పట్టించుకోలేదని అన్నారు.

ఇక ఇక్బల్ రాజీనామాతో పీలేరు వ్యాప్తంగా కొంత సంచలనంగా మారింది. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇక్బల్ ఏపార్టీలో చేరుతాడన్నది కొంత చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వైసిపి పార్టీతో ఇక్బల్ టచ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్బల్ నేరుగా బయటకు వచ్చి ఏపార్టీలో చేరుతున్నది చెప్పే వరకు పీలేరు నియోజకవర్గంలో ఉత్కంఠతకు తెరపడదు. మరో వైపు జనసేన కార్యకర్తలు జనసేనలో చేరుతాడని కూడా ప్రచారం చేస్తున్నారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •