కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలు విలవిలలాడిపోతున్నాయి. చైనాలో వుహాన్ నగరంలో మొదలైన ఈ కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూనే ఉంది. తాజాగా కరోనా దెబ్బకు మరో దేశ ప్రధాన మంత్రి క్యారంటైన్ లోకి వెళ్లారు. ఇప్పటికే బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్ కరోనా మహమ్మారి భారిన పడి కోలుకున్నారు. ముందుగా ఆయన హోమ్ క్యారంటైన్ కి వెళ్లిన తరువాత వ్యాధి ముదరడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు.

ఇప్పుడు తాజాగా మలేసియా ప్రధాన మంత్రి ముహిద్దీన్ యాసిన్ హోమ్ క్యారంటైన్ కి వెళ్లారు. 14 రోజుల పాటు ఆయన హోమ్ క్యారంటైన్ లో ఉంటారని ఆయన కార్యాలయం ప్రకటించింది. ఈ వారంలో ఆయన నిర్వహించిన సమావేశంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో తాజాగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ముహిద్దీన్ యాసిన్ కి టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చినట్లు డాక్టర్లు తెలియచేసారు.

తెలంగాణలో 1700 దాటిన పాజిటివ్ కేసులు.. 48 మృతులు..!

ఈ రెండు తేదీలను ఎప్పటికి మరచిపోనంటున్న నాగార్జున..!