అంతర్జాతీయ క్రికెట్ నుంచి త్వరలో వీడ్కోలు తీసుకోనున్న మలింగా తన స్థిర నివాసాన్ని ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసుకొనునట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో తన పేర్మినెంట్ రెసిడెన్స్ కోసం అప్లై చేసుకోగా అందుకు సంబంధించి ఆమోదం వచ్చిందట.

ఈనెల 26వ తారీఖున స్వదేశంలో బంగాళాదేశ్ తో జరిగే తొలి వన్డేతో మలింగా తన రిటైర్మెంట్ ప్రకటించి, ఆ తరువాత కుటుంబంతో కలసి శాశ్వతంగా ఆస్ట్రేలియాలో నివసించనున్నట్లు తెలుస్తుంది. ఇక రిటైర్మెంట్ తరువాత ఆస్ట్రేలియాలో కోచ్ గా అవతారమెత్తి తన తరువాత ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మలింగా వచ్చే ఏడాది ఐపీఎల్ లో కొనసాగుతాడా లేక పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •