మొదటి సినిమా ‘రన్ రాజా రన్’ తోనే మంచి హిట్ కొట్టిన దర్శకుడు సుజిత్. ఇక రెండవ సినిమాగా ‘సాహో’ వాటి భారీ సినిమాను తెరకెక్కించే అవకాశం దక్కింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా పరాజయం పాలయ్యింది. అయితే హిందీ వెర్షన్ లో హిట్ అయిన సినిమా తెలుగులో మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

అయితే తాజా సమాచారం ప్రకారం సుజిత్.. మూడవ సినిమా కూడా యూవీ క్రియేషన్స్ బ్యానేర్ లోనే చేస్తున్నాడు. సుజిత్ మొదటి రెండు సినిమాలను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. శర్వానంద్ హీరోగా నటించనున్న ఈ సినిమా మంచి కామిడి సినిమాగా తెరకెక్కనుందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించనున్నారట.