కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ 4.0 కు సంబంధించి మార్గదర్శకాలను జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కంటైన్మెంట్, రెడ్ జోన్లు మినహా మిగిలిన చోట్ల అన్ని కార్యకలాపాలు జరుపుకోవచ్చని, మాల్స్, సినిమా హాళ్లకు మాత్రం పర్మిషన్ లేదని చెప్పుకొచ్చారు. కానీ మోదీ అంటేనే కస్సున లెగిసే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయవల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెబుతున్నారు.

కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాలలో షాపింగ్ మాల్స్, బిగ్ స్టోర్స్ అన్ని తెరుచుకోవచ్చని, దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం చెప్పిన రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కూడా అమలు చేయమని, ప్రజలు స్వేచ్ఛగా తిరగవచ్చని చెప్పుకొస్తున్నారు. ప్రధాని మోదీతో ఆమెకు ఉన్న విరోధంతో లాక్ డౌన్ ను పూర్తిగా సడలించి కేంద్రం చెప్పినట్లు నేను ఎందుకు అమలు చేయాలని మాట్లాడుతుండటంతో ప్రజలకు మరింత ఆపద తెచ్చిపెట్టేదిలా ఉంది. పశ్చిమ బెంగాల్ లో ఇప్పటి వరకు 2677 మందికి కరోనా వైరస్ సోకగా 238 మంది చనిపోయారు. ప్రస్తుతం 1480 కేసులు యాక్టీవ్ లో ఉన్నాయి.

ఫ్లిప్ కార్ట్ కీలక నిర్ణయంతో కస్టమర్స్ అభినందనలు

భగ్గుమంటున్న బంగారం ధర.. 50 వేలకు చేరువలో..!

గొంతు కోస్తానని బెదిరించడంతో ఆరు సిక్స్ లతో సమాధానం చెప్పా