ఇద్దరి మిత్రుల మధ్య జరిగిన ఒక పందెం మనిషి ప్రాణాలను తీసింది. ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మృతుడు సుభాష్ యాదవ్ అతడి స్నేహితుడు దగ్గరలోని బిబి గంజ్ మార్కెట్ కు గుడ్లు తినడానికి వెళ్లారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో వారిద్దరి మధ్య మాట మాట పెరగడంతో 50 గుడ్లు తింటే రెండు వేల రూపాయలు ఇస్తానని పందెం కట్టడంతో సుభాష్ యాదవ్ ఛాలెంజ్ ను స్వీకరించి గుడ్లు తినడానికి ఒప్పుకున్నాడు.

సుభాష్ యాదవ్ తాను 50 గుడ్ల ఛాలెంజ్ లో 41 గుడ్లు తిన్న తరువాత 42వ గుడ్డు తినే సమయంలో కుప్పకూలి పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా అతడి పరిస్థితి సీరియస్ గా ఉందని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆసుపత్రికి తరలించారు. కానీ అతడు కొన్ని గంటల వ్యవధిలోనే మరణించడం జరిగింది. వైద్యులు చెబుతూ అతిగా గుడ్లు తినడం వలనే చనిపోయాడని పేర్కొన్నారు. దీనిపై అతడి కుటుంబసభ్యులు మాట్లాడటానికి ఎవరు ముందుకు రాలేదు. మరొకవైపున ఈ ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.