కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుండి మద్యం షాపులును కూడా దేశవ్యాప్తంగా మూసి వేసిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం నుండి పలు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ జోన్, ఆరంజ్ జోన్ లలో మద్యం షాపులు ఓపెన్ చేశారు. దీంతో మందు బాబులు మద్యం షాపులకు భారీగా తరలివచ్చారు. అయితే యూపీలో కూడా మద్యం షాపులు తెరవడంతో మద్యానికి బానిసైన వ్యక్తి తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా గర్భిణీ అయిన తన భార్యను నిర్దాక్షిణంగా కాల్చి చంపాడు. ఉత్తరప్రదేశ్ లో జాన్పూర్ నగర్ లో ఈ ఘటన కలకలం సృష్టించింది.

దీపక్ సింగ్ అనే వ్యక్తి తాగడానికి డబ్బులు లేకపోవడంతో భర్య నేహాను డబ్బులు అడగడంతో ఆమె నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దీపక్.. తన భార్యను కాల్చి చంపాడు. ఇక స్థానికులు శబ్దం విని అక్కడకి చేరుకొని ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి చేర్చారు. ఇక అప్పటికే ఆ మహిళ చనిపోయింది. ఇక ఆ మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు. ఇక నేహా సోదరుడు పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె నాలుగు నెలల గర్భవతని బంధువులు తెలియచేసారు.

వాట్సాప్ లో రాబోతున్న అద్భుతమైన ఫీచర్.. ఇక ఆ సంస్థలకు గట్టి పోటీ..!

కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సంచలన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఆందోళన..!

కటింగ్ చేయనన్నందుకు బార్బర్ ను కాల్చి చంపాడు..!