దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత గాధను ఆధారంగా చేసుకొని జాగరమంది క్రిష్ దర్శకత్వంలో “మహానాయకుడు, కథనాయకుడు” సినిమాలు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలు ప్లాప్ టాక్ మూటగట్టుకోవడంతో పాటు బాలకృష్ణ హీరోగా చేసిన “మహానాయకుడు, కథానాయకుడు” సినిమాలకు అయితే బారి నష్టాలు రావడం జరిగింది.

ఇప్పుడు ఆ మూడు సినిమాలు ప్లాప్ టాక్ మూటగట్టుకోవడంతో మంచి మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జీవితగాదాను ఆధారంగా చేసుకొని వెబ్ సీరియస్ ను ప్లాన్ చేశారు. ఈ సీరియస్ లో ఎన్టీఆర్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడు. ఈ వెబ్ సీరియస్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ జీ5లో ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ వెబ్ సీరీస్ కు సంబంధించి షూటింగ్ మొదలైందని మరికొద్ది రోజులలో జీ5లో ప్రసారం అవుతుందని తెలుస్తుంది.

మంచు మోహన్ బాబు ఎన్టీఆర్ ను దగ్గర నుంచి చూసారు. మోహన్ బాబుకి ఎన్టీఆర్ అంటే ఎనలేని గౌరవం. ఎప్పుడు ఎన్టీఆర్ గురించి చెబుతూ అతడి క్రమశిక్షణ ఎలా ఉండేదో ఇప్పటికి చెబుతుంటారు. అందువలన ఎన్టీఆర్ గురించి పూర్తి విషయాలు మోహన్ బాబుకి తెలిసి ఉండటంతో అతడే స్వయంగా కథను అందచేస్తునట్లు తెలుస్తుంది. రాజ్ అనంత్ అనే దర్శకుడు ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించడం జరుగుతుంది. ఇప్పటికే మూడు సినిమాలు ఎన్టీఆర్ జీవితగాథపై తీసి చేతులు కాచుకోవడంతో మంచి కుటుంబం తీసే సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •