ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘RRR’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కొమరం బీమ్ గా ఎన్టీఆర్ నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమాలో నటించబోతున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో ‘అరవింద సమేత’ సినిమా వచ్చి మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ ను విలన్ గా నటింపచేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. మనోజ్ నటిస్తే ఈ సినిమాలో బాగుటుందని.. ప్రేక్షకులు కొత్తగా పీలవుతారనే భావనలో త్రివిక్రమ్ ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ పట్ల చిత్ర యూనిట్ స్పందించవలసి ఉంది. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

నందమూరి బాలకృష్ణ సరసన అమలాపాల్..?

పాయల్ రాజ్‌పుత్ కు బంపర్ ఆఫర్..!

టెన్త్ పరీక్షలు రాసిన 32 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్