అసెంబ్లీలో ఆమోదించబడిన బిల్లు శాసన మండలిలో దానిపై చర్చ జరిపి, బిల్లును ఆమోదించాలని లేకపోతే రిజెక్ట్ చేసి తిరిగి అసెంబ్లీకి పంపించాలి. అలాచేయకుండా ప్రజలచేత ఎన్నుకోబడిన నాయకులూ ఆమోదించిన బిల్లును మేధావుల పేరుతో డబ్బున్న రాజకీయ నాయకులూ డబ్బులిచ్చిన కొనుకున్న శాసన మండలిలో తామేదో పొడిచేస్తున్నామన్నట్లు ప్రజామోదాన్ని వ్యతిరేకంగా బిల్లుని ముందు వెళ్లనివ్వకుండా సెలెక్ట్ కమిటీకి పంపి మూడు నెలలు తాత్సారం చేయాలని చూడటంతో సీఎం జగన్ నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ అసలు శాసన మండలి వ్యవస్థ మనకు అవసరమా అసలు మన మండలి ఉండాలో వద్దొ సోమవారం సభలో చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలియచేసారు.

దీనితో తెలుగుదేశం నేతలకు చుక్కలు కనపడినట్లున్నాయి. శాసన మండలిలో వైసీపీ నేతలు 10 మంది ఉంటే టీడీపీ నేతలు దాదాపుగా 30 మంది ఉన్నారు. ఇలా సీఎం జగన్ నిర్ణయం చేయడంతో మండలి చైర్మెన్ షరీఫ్ మాట్లాడుతూ మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపడం సాంకేతికంగా పూర్తి కాలేదని, ప్రస్తుతానికి ఈ ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పడంతో పాటు ప్రక్రియ పూర్తయితేనే సెలెక్ట్ కమిటీకి చేరుతాయని అన్నారు.

మండలి రద్దు చేయాలా వద్ద అన్నది ప్రభుత్వం తీసుకోవలసిన నిర్ణయమని, తనను వైసీపీ మంత్రులు దూషిస్తున్నట్లు వస్తున్న వార్తలు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందని, ఆవేశంలో మాట్లాడారు తప్ప నన్ను ఎవరు దూషించలేదని, ఒక సంఘటన జరిగేటప్పుడు ఉద్రేకపడ్డ సమయంలో కోపమొస్తుందని, అలాంటి సమయంలో కొన్ని పదాలు నోటి నుంచి వస్తాయని, వాటిని తప్పు పట్టవలసిన అవసరం లేదని అన్నారు. ఇక సీఎం జగన్ మండలి రద్దు అనడంతో మండలి రద్దు అనడంతో బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించకుండా వెనకడుగు వేస్తారేమో చూడాలి. టీడీపీ ఎత్తు వేస్తే… దానికి వైసీపీ పైఎత్తు వేసి వారిని షాక్ కు గురి చేసిందని చెప్పుకోవచ్చు.

  •  
  •  
  •  
  •  
  •  
  •