భారీ అంచనాలతో వచ్చిన ‘మన్మధుడు -2’ సినిమా ఘోర పరాజయం పొందడంతో నాగార్జున తన రూటును మార్చాడు. ఇప్పడు ఓ డిఫరెంట్ జోనర్ లో సినిమా చేస్తున్నాడు. నాగార్జున తాజాగా చేస్తున్న సినిమా ‘వైల్డ్ డాగ్’. ఈ సినిమాలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ వర్మగా నటిస్తున్నాడు నాగ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత ‘బంగార్రాజు’ సినిమాలో నటించబోతున్నాడు నాగార్జున. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ మూవీ ఎప్పుడో ప్రారంభం కావలసి ఉన్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోదరుడి మరణంతో ఈ సినిమా ఆలస్యం అయ్యింది. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజి లో ఉన్నాయి. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్తుందట. ఈ సినిమా కోసం అనూప్ రూబెన్స్ సాంగ్స్ కంపొజిషన్ పనిలో ఉన్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •