గతంలో రక్షణ, శివమణి వంటి సినిమాలలో పోలీస్ ఆఫీసర్ గా చేసిన కింగ్ నాగార్జున.. ఇప్పుడు మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంతో ఎప్పుడు ముందుండే నాగార్జున.. ఇప్పుడు సోలోమన్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాకు సంభందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట.

ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్ర కొత్తరకంగా ఉంటుందట. త్వరలో ఈ సినిమా అధికారిక ప్రకటన రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జున ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.