‘చంద్రయాన్ 2’ పరీక్షలో గత రెండు నెలలుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటు చంద్రుని మీదకు ల్యాండ్ అయ్యే క్షణంలో 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్ తో కనెక్టివిటీ కోల్పోవడంతో శాస్త్రవేత్తలతో పాటు, యావత్ భారతదేశం కలవరపాటుకు గురైంది. ఇస్రో నుంచి ప్రత్యక్షంగా వీక్షించాలనుకున్న మోదీ కూడా శాస్త్రవేత్తలకు దైర్యం చెప్పి ఇప్పటి వరకు మీరు సాధించినది అమోఘమని, మీ పరీక్షలు ఇలానే కొనసాగించండని చెప్పి తిరిగి వెళ్లిపోయారు.

ఇక ల్యాండర్ మిస్సింగ్ కు సంబంధించి ఇస్రో శాత్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇస్రో పంపించిన డేటాతో పాటు చంద్రుని కక్ష్యలో తిరుగుతూ చంద్రుని మీదకు దిగే సమయంలో ల్యాండర్ వేగంతో పాటు, ఎలాంటి ఆటుపోట్లకు గురైందో డేటాను పరిశీలిస్తున్నారు. ఆచూకీ లేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ ను మరో మూడు రోజులలో కొనుగొనే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చంద్రుని కక్ష్యలో ఆర్బిటరీ ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేయడానికి మూడు రోజుల సమయం పడుతుందని… ఈ మూడు రోజుల తరువాత ల్యాండింగ్ ప్రదేశం పైకి ఆర్బిటరీ వచ్చి ఫోటోలు తీస్తే విక్రమ్ ఆచూకీ దొరికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇక విక్రమ్ ఆచూకీ తిరిగి దొరుకుతుందా లేదా ‘చంద్రయాన్ 2’ మిషన్ ఎంత వరకు సక్సెస్ అయిందన్న విషయాలపై ట్విట్టర్ లో నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •