క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య మాయంతి లాంగర్ అనే కంటే మాయంతి లాంగర్ భర్త స్టువర్ట్ బిన్నీ అంటనే ఎక్కువ మందికి తెలుస్తుందేమో. అంతలా మాయంతి లాంగర్ తన క్రికెట్ కామెంటరీతో అభిమానులను సంపాదించుకుంది. పొట్టి పొట్టి దుస్తులతో చూడటానికి అందంగా మంచి హైట్ ఉండే మాయంతి లాంగర్ కు అభిమాన ఘనం ఎక్కువే. గత ఐదేళ్లుగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో తన కామెంటరీతో అలరిస్తుంది. కానీ ఈ ఏడాది ఆమె ఐపీఎల్ లో కనిపించకపోవడమతొ సోషల్ మీడియాలో మాయంతి లాంగర్ హ్యాష్ ట్యాగ్ తో అభిమానులు మిస్ అవుతున్నామని ఆమెకు ట్వీట్స్ చేస్తున్నారు.

మాయంతి లాంగర్ ఈ ఏడాది కనిపించకపోవడానికి కారణం ఆమెకు ఆరు వారాల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. దీనితో ఈ ఏడాది ఆమె యంకరింగ్ చేయలేకపోతుందట. కరోనా వైరస్ లేకపోయినట్లయితే తాను గత మార్చిలో ఐదు నెలల గర్భవతిగా యాంకరింగ్ చేయాలని నిర్ణయించుకున్నానని కానీ కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ అప్పుడు జరగకపోవడంతో ఇప్పుడు ఆరు వారల బిడ్డతో తాను యాంకరింగ్ మిస్ అవుతున్నానని చెప్పుకొస్తుంది. మాయంతి లాంగర్ ఇంకా చెబుతూ తనను గత ఐదేళ్లుగా స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం ఒక కుటుంబసభ్యురాలిగా ఆదరిస్తున్నారని, వారి వలనే తనకు ఇంతమంది అభిమానులు కలిగి ఉండటం జరుగుతుందని చెబుతుంది. తాను ప్రస్తుతం తన భర్త స్టువర్ట్ బిన్నీతో కలసి తమ బిడ్డ మధురక్షణాలను ఆస్వాదిస్తున్నామని చెప్పుకొచ్చింది.