తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో గెలిచినా రెండు అసెంబ్లీ సీట్లపై ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఆసక్తిగా ఉన్నాడని కథనాలు వస్తున్నాయి. మరొక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వర రావు తాను టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరాలని, తెలుగుదేశం పార్టీలో ఉన్నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవచ్చన్న రీతిలో మాట్లాడుతూ వచ్చారు.

నిన్న మెచ్చ నాగేశ్వర రావు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత తుమ్మల నాగేశ్వర రావును కలవడంతో మెచ్చ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిక లాంఛనమనే అనుకున్నారు. కానీ మెచ్చ నాగేశ్వర రావు మాత్రం తాను తుమ్మలను తాను రాజకీయ గురువుగా భావిస్తానని, ఒక శిష్యుడిగా మాత్రమే తుమ్మలను కలిసాను తప్ప, పార్టీ మారే ఉద్దేశాలు లేవని చెబుతున్నారు. కానీ ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేర్పించే పని కేసీఆర్ తుమ్మలకు అప్పగించారని, అందుకే తుమ్మల నాగేశ్వర రావు టిడిపి ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వర రావును కలిసారని కథనాలు వినపడుతున్నాయి.