తాను ఒక దళితుడునని తనను ఎవరు ఏమి చేయలేరని, తెలుగుదేశం పార్టీ ముసుగులో మత్తు డాక్టర్ సుధాకర్ ఆడిన ఆటలు అన్ని ఇన్ని కావు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు కనుసన్నలలో సుధాకర్ ప్రభుత్వంపై మాస్కులు ఇవ్వడం లేదని తప్పుడు ఆరోపణలు చేయడంతో ఏపీ ప్రభుత్వం అతడిని అరెస్ట్ చేసింది. ఇక రెండు రోజుల క్రితం రోడ్డు మీద తప్ప తాగి పోలీసులతో పాటు సీఎం జగన్ ను, రోడ్డు మీద వెళ్లే ప్రజల పట్ల తన కర్కశత్వాన్ని చూపిస్తూ వినరాని బూతులు తిడుతుంటే అతడికి ఎక్కడ కరోనా వైరస్ ఉందేమో అన్న భయంతో అతడి చేష్టలు చూసి పోలీసులు అతడి చేతులు కట్టివేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

దీనిపై చంద్రబాబు నాయుడు అండ్ అతడి సుపుత్రుడు జూమ్ వీడియో, సోషల్ మీడియా ద్వారా కరోనా భయంతో ఇంట్లో దాక్కుని ఎంత రాద్ధాంతం చేయాలో అంతా చేసారు. ఒక దళితుడిని అనాయ్యంగా చిత్రహింసలు పెడుతున్నారని, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి పచ్చ మీడియాను కూడా ఉసిగొల్పి అతడు ఒక మహాత్ముడనట్లు కటింగ్ ఇచ్చారు. ఇప్పుడు భారతీయ వైద్య సంఘం కూడా దీనిపై స్పందిస్తూ డాక్టర్ సుధాకర్ ను అలా వెనక్కు కట్టేసి తీసుకొని వెళ్లడం దారుణమని దీనిపై విచారణ చేపట్టాలని జగన్ సర్కార్ ను కోరుతున్నారు.

అతడు రోడ్డు మీద పడి ఇష్టానుసారం తప్ప తాగి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. గత రెండు నెలలుగా నిద్రాహారాలు మానేసి లాక్ డౌన్ సమయంలో ప్రజలను కాపాడటానికి పోలీసులు ఎంతో కష్టపడుతుంటే వారి సహనాన్ని పరీక్షించేలా వారిపై సిగిరెట్లు విసరడం ఇంకా పలు రకాల ఇబ్బందులు వారిని గురి చేయడంతో చివరకు తప్పక సుధాకర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు పంపితే ఇప్పుడు విచారణకు ఆదేశించాలని భారతీయ వైద్య శాఖ కోరుతుంది.

అంటే భారతీయ వైద్య సంఘం ఆ వీడియోలు చూడలేదనుకోవాలా? చూసి ఏమి తెలియనట్లు నటిస్తూ ఎవరో చెప్పినట్లు ఆడుతున్నారనుకోవాలా? డాక్టర్ అయితే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తే అరెస్ట్ చేయకూడదా? అవునవును రేపిస్టులకు కూడా సానుభూతి కల్పించాలని రాష్ట్రపతికి పిటిషన్ లు పెట్టుకొనే అవకాశం ఉన్న దేశంలో ఇలా తప్ప తాగి ఇష్టానుసారం రోడ్డపై దొర్లుకుంటూ సీఎం జగన్ తో పాటు, పోలీసులను తిట్టినవాడి పట్ల సానుభూతి వ్యక్తం చేయకుండా ఉంటారా?

అమెరికా నుంచి అబ్బాయి ఐఫోన్ పంపాడని పోస్ట్ పెడితే ఇలానే ఉంటది బామ్మగారు

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్