సీనియర్ అగ్ర హీరోయిన్ మీనా లాక్ డౌన్ తరువాత షూటింగ్ లో పాల్గొన్నారు. ‘దృశ్యం 2’ మూవీ షూటింగ్ కోసం చెన్నై నుండి కేరళకు ప్రయాణించిన ఆమె సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. కరోనా సూట్ ధరించి ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేశారు. అంతరిక్షంలోకి వెళ్ళడానికి సిద్ధమైనట్టు ఉన్నాను కథా.. నాకు యుద్దానికి వెళ్తున్న భావన కలుగుతుందని.. దాదాపు ఏడు నెలల తరువాత ప్రయాణం చేసాను. ఇది ఎంతో అసౌకర్యమైన డ్రెస్.. చాలా ఉక్కపోతగా చికాకుగా అనిపించింది.

ఇలా రోజంతా సూట్ లో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు హ్యాట్సాఫ్‌. ఇలాంటి అసౌకర్యవంతమైన దుస్తుల్లోనూ రోగుల భాదల్ని అర్ధం చేసుకుని.. సౌమ్యంగా వ్యవహరించడం గొప్ప విషయం. వైదులపై నాకు ఇంకా గౌరవం పెరిగిందని మీనా పోస్ట్ చేసింది. ఇక ‘దృశ్యం 2’ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 2013 లో వచ్చిన ‘దృశ్యం’కు ఇది సీక్వెల్ గా వస్తుంది.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు కొట్టివేత.. అందరూ నిర్దోషులే..!

మెగాస్టార్ చిరంజీవి మూవీలో రమ్యకృష్ణ..!