జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనను వేధిస్తున్నారని నటి మీరా చోప్రా సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. తాజాగా సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పలు విషయాలను పంచుకుంది మీరా చోప్రా. ఈ సందర్భంగా ఓ నెటిజన్ తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరని అడగగా.. దానికి ఆమె మహేష్ బాబు అని సమాధానం ఇచ్చారు. ఇక మరో నెటిజన్ ఎన్టీఆర్ గురించి అడగ్గా, తాను ఆయన ఫ్యాన్ కాదని మహేష్ బాబు ఫ్యాన్ అని చెప్పింది.

ఇక మహేష్ బాబు ఫ్యాన్ అని చెప్పడంతో ఎన్టీఆర్ ఫాన్స్ అసభ్య పదజాలంతో దూషిస్తూ ట్విట్లు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇక సైబర్ క్రైమ్ పోలీసులకు తనను దూషించిన ఎన్టీఆర్ అభిమానులపై చర్యలు తీసుకోవాలని వారి ఖాతాలను రిమూవ్ చేయాలంటూ కోరారు.

సచివాలయంలో 8 మందికి కరోనా రావడంతో తీవ్ర కలకలం..!

అచ్చంనాయుడుకి వెన్నుపోటా, ఇది ఏ టైపు వెన్నుపోటు కిందకొస్తుంది గురూజీ