మెగా కుటుంబంతో పరిచయమేర్పడి కాస్త క్వాలిటీ ప్రోడక్ట్ తో సినిమాను కనుక చేస్తే దాదాపుగా మూడు, నాలుగేళ్ళ పాటు మెగా కుటుంబంలో సెటిల్ కావచ్చు. దాదాపుగా తొమ్మిది మంది హీరోలు అక్కడ ఉన్నారు. ఒకరి వెనుక ఒకరితో జాగ్రత్తగా ప్లాన్స్ చేసుకుంటే వర్క్ అవుట్ అవుతుంది. కానీ ఇండస్ట్రీలో కొంతమంది చిరంజీవికి ఎప్పుడు డబ్బు కొడుతూ ఆఫర్స్ కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటివి తెలుగు ఇండస్ట్రీలో సర్వసాధారణమనుకోండి. అసలు చిరంజీవి చేతి చలువ ఉంటే ఇండస్ట్రీలో ఎలాగైనా బతికేయవచ్చన్న నానుడు ఉంది.

ఇప్పుడు ఆ జాబితాలో చిరంజీవితో వరుస పెట్టి సినిమాలు చేయడానికి వివి వినాయక్, మెహర్ రమేష్, బాబీ సిద్ధమవుతున్నారు.వివి వినాయక్ ఇప్పటికే చిరంజీవితో “ఠాగూర్, ఖైదీ నెం:150” సినిమాలను తీశారు. ఇప్పుడు అతడికి “లూసిఫెర్” రీమేక్ అప్పగించనున్నట్లు తెలుస్తుంది. ఇక మెహర్ రమేష్ సంగతి చెప్పుకుంటే చిరంజీవి కుటుంబానికి కాస్త దగ్గర బంధుత్వం ఉంది. హీరో మహేష్ బాబుకి అత్యంత సన్నిహితుడు.

ఇప్పుడు మెహర్ రమేష్ తమిళంలో సూపర్ హిట్ అయిన “వేదలమ్” సినిమాను డైరెక్ట్ చేసే అవకాశమొచ్చినట్లు తెలుస్తుంది. ఇక మరొక డైరెక్టర్ బాబీ కూడా చిరంజీవితో సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు. ఈమధ్య చిరంజీవి మీడియా ముఖంగా బాబీతో తన సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనితో ఇప్పుడు ఈ ముగ్గురు తమ సినిమాలు చేజారిపోకుండా చిరంజీవి భజనలో మునిగితేలుతున్నారు.

వివి వినాయక్ సంగతి పక్కనపెడితే మెహర్ రమేష్, బాబీ మాత్రం చిరంజీవిని ఆకాశానికెత్తేస్తున్నారట. కానీ మెహర్ రమేష్ తీసిన మూడు సినిమాలు ఎంతటి డిజాస్టర్ గా నిలిచాయి అందరకి తెలిసిన విషయమే. అలాంటిది చిరంజీవి చూసి చూసి మెహర్ రమేష్ కు ఆఫర్ ఇస్తాడంటారా? అసలు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికి ఇబ్బంది పడుతున్న బడా హీరోలు కోసం ఏళ్ళ తరబడి మరో సినిమా మీదకు వెళ్లకుండా చిరంజీవి కోసం వెయిట్ అయితే చేస్తారుగాని, హీరో చిరంజీవి మనస్సు మారితే చివరకు ఆఫర్ పిట్టలా రాలిపోయినా చేయడానికి ఏముండదు. గతంలో ఇలాంటివి ఎన్నో చూసాం. ఒక బడా హీరో కోసం ఏళ్ళ తరబడి వెయిట్ చేసి చివరకు ఆఫర్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చిన ఘటనలు ఎన్నో ఎనెన్నో.