రామ్ గోపాల్ వర్మ గత పది రోజులుగా పొడిచేస్తా… పీకేస్తా అంటూ ఒక 37 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీసి 150 రూపాయలతో అతడిని నమ్మి సినిమా కొని చూసినవారికి పంగనామాలు పెట్టాడు. సినిమాలో విషయం లేకపోవడంతో పాటు తేలిపోవడంతో సినిమా చూసిన జనం వర్మను యధావిధిగా తిట్టుకోవడం పరిపాటిగా మారింది. ఇక ఈ సినిమా విషయంలో మెగా అభిమానులు ఎంతో ఆవేశంతో సోషల్ మీడియాతో పాటు వర్మ ఆఫీస్ పై దాడికి ప్రయత్నించినా మెగా కుటుంబం నుంచి చిన్న ఖండన కూడా “పవర్ స్టార్” సినిమాపై రాలేదు.

దీనికి కారణం వర్మ తీసే “పవర్ స్టార్” సినిమా ఎలా ఉంటుంది. దానిలో ఎలాంటి డైలాగ్స్ ఉండబోతున్నాయనే అప్ టు డేట్ మొత్తం చిరంజీవి ముందుగానే తెప్పించుకొని, సినిమాలో విషయం లేదని అనవసరంగా మనం ఆ సినిమా గురించి రెచ్చిపోయి వర్మకు మరింత హైప్ తీసుకురావడం అనవసరమని సైలెంట్ అయిపోయారట. ఒకానొక సమయంలో నాగబాబు ఆవేశపడి మీడియాతో మాట్లాడాలనుకొంటె చిరంజీవి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో సైలెంట్ అయిపోయారట.

వర్మ తాను ఎంతో నమ్మకమైన టీమ్ ను పెట్టుకున్నా సినిమా ఇండస్ట్రీలో మరింత ఎదగడానికి వర్మ దగ్గర పనిచేసే ఒకరిద్దరు వర్మకే వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తుంది. దీనితో సినిమా తేలిపోయిందని ముందుగానే గ్రహించి మెగా కుటుంబం మాట్లాడలేదు. ఇక పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలు పార్టులు పార్టులుగా విడుదలవుతున్నా అందులో రామ్ గోపాల్ వర్మ గురించి చిన్న వ్యాఖ్య కూడా చేయలేదు. ఒకరిద్దరు ఖండించమని కోరినా ఇప్పుడు జాతీయ నాయకుడిగా తాను ఎదుగుతున్నానని వర్మ లాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి