మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఆగష్టు 22 సందర్భంగా అభిమానులకు డబుల్‌ బొనాంజా ఇవ్వనున్నారు. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. కరోనా ముందు సగభాగం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆగష్టు 22 చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు.

అలాగే ఆ రోజు మెగా ఫాన్స్ కు మరో ట్రీట్ ఇవ్వబోతున్నారు. మెహర్‌ రమేశ్‌తో తీయనున్న రీమేక్‌ ప్రాజెక్టును కూడా ప్రకటిస్తాడని ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ హిట్ మూవీ ‘వేదాళం’ రీమేక్ చిరంజీవి నటించబోతున్నారు. 2015 లో అజిత్ నటించిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో అజిత్ మాస్ రోల్లో ప్రేక్షకులను బాగా అలరించాడు. ఇక ఈ సినిమా తనకు బాగా సూటవుతుందని భావించిన చిరంజీవి.. ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ‘ఆచార్య’ షూటింగ్ పూర్తయిన తరువాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె ఎస్ రామారావు ఈ సినిమాను నిర్మించనున్నారు.

వాటితో పుక్కిలిస్తే తగ్గుతున్న కరోనా..!

బిగ్ న్యూస్.. కరోనాకు వ్యాక్సిన్ విడుదల చేసిన రష్యా..!

క్షీణించిన నవనీత్ కౌర్ ఆరోగ్యం..!