మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ ఒంటరిగా ఉంటున్నాడట. కరోనా వైరస్ నేపథ్యంలో రెండు నెలలుగా ఆగిపోయిన సినిమా షూటింగులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కళ్యాణ్ హీరోగా ‘సూపర్‌ మచ్చి’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగులో ప్రస్తుతం కళ్యాణ్ పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఆయన, తన ఫ్యామిలీ కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

లాక్ డౌన్ ముందే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సూపర్‌ మచ్చి’.. ఇప్పుడు మిగతా షూటింగును కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో కళ్యాణ్ ప్రతి రోజు షూటింగులో పాల్గొంటున్నాడు. షూటింగ్ మొత్తం పూర్తై, తనకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగిసే వరకు ఫ్యామిలీకి దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నారట.ఈ మేరకు తన ఇంటి గ్రౌండ్ ఫ్ల్లోర్ లో ఒంటరిగా ఉంటూ ఇంటి పనులన్నీ తానె చేసుకుంటున్నాడట. బయట కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఇంట్లో వాళ్లకు ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దెశంతో కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నదంటున్నారు. రోజు తన కుమార్తె, భార్య శ్రీజాతో తరుచు మాట్లాడడానికి వీడియో కాల్ చేస్తున్నాడట. ఇక కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అందరికి ఆదర్శంగా నిలుస్తుందని పలువురు ప్రశంసిస్తున్నారు.

గుడ్ న్యూస్: ఆగష్టు 15న మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ.. ఒక్కరోజులోనే 20 వేలకు పైగా కేసులు..!