ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తుంది. ఈ మధ్యకాలంలో అనేక బయోపిక్ లు తెరకెక్కాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ ను కూడా తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నారట. సినిమా ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి ఎంతో కష్టపడ్డ సంగతి తెలిసిందే.

చిరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన వైనం.. ఆ తర్వాత అల్లు రామలింగయ్య కూతురును పెళ్లి చేసుకోవడం, పెళ్లి తర్వాత చిరుకి మరిన్ని అవకాశాలు రావడం ఈ తర్వాత చిరు ఎలా ఎదిగాడు, చిరంజీవి.. మెగాస్టార్ గా అనేక సంచలనాలు, ఇండస్ట్రీ రికార్డులు ఎలా సృష్టించాడో తెరకెక్కించబోతున్నారు. ఆ తర్వాత సడెన్ గా ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం మొదలైనవన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. అందుకే వీటిని అన్నింటితో బయోపిక్ తెరకెక్కించాలని చూస్తున్నారట.. మరి ఈ బయోపిక్ కు ఎవరు డైరెక్టర్ చేస్తారనేది చూడాలి.

ప్రస్తుతం మెగాస్టార్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మాత. ఈ మూవీ ఆగష్టు 15 న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.