మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిరు బర్త్ డే ఆగష్టు 22న ప్రారంభం కానుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో చిరుకి జంటగా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నట్లు సమాచారం. స్కిప్ట్ ఫైనల్ వెర్షన్ జరుగుతుంది. ఇంకా నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో ఓ మంచి సోషల్ మెసేజ్ ఉండబోతుందట. వచ్చే వారంలో ఈ సినిమాలో చిరు లుక్ కి సంబందించిన టెస్ట్ జరగబోతుంది. ప్రస్తుతం చిరు’ సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర సమరవీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో చిరు నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •