చైనా ఆటోమొబైల్ సంస్థ ఎంజి హెక్టర్ కార్లను భారత్ లో జూన్ 27వ తేదీన లాంచ్ చేసింది. ఎంజి హెక్టర్ కార్ల బుకింగ్ ప్రారంభించి నెల రోజులు తిరగకుండానే బుకింగ్స్ వెల్లువలా ఉండటంతో వెంటనే జులైలో బుకింగ్స్ ను నిలిపి వేయడం జరిగింది. తమ సంస్థ ఇలా బుకింగ్స్ ఆపివేసినందుకు క్షమించాలని, మరల తిరిగి త్వరలో బుకింగ్స్ ప్రారంభిస్తామని అప్పుడు తెలియచేసారు. ఇందులో భాగంగా వచ్చే అక్టోబర్ చివరి వారంలో ఎంజి హెక్టర్ కు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యే అవకాశం ఉందని సంస్థ ప్రతినిధులు తెలియచేస్తున్నారు. భారత్ లో ఎంజి హెక్టర్ కారు ఎక్స్ షోరూం ధర 12.18 లక్షల నుంచి 16.88 లక్షల మధ్య ఉంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •