నవంబర్ లో అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు జరగనున్నాయి. ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తో పోటీ పడనున్నారు మైకేల్‌ బ్లూమ్‌బర్గ్‌. డెమొక్రాట్‌ల నుండి అధ్యక్ష పదవికి పోటీపడుతున్న మైకేల్‌ బ్లూమ్‌బర్గ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష పదవికి ఎక్కికైతే తనను బిలినియర్ ను చేసిన బ్లూమ్‌బర్గ్‌ను ఆయన అమేస్తారని మైకేల్ ప్రతినిధులు ప్రచార ప్రతినిధులు స్వష్టం చేశారు.

తాజాగా ఒపీనియన్ పోల్ లో మైకేల్‌ అనూహ్యంగా ముందుకొచ్చారు. వాణిజ్య ప్రచారంతో పాటు వార్తలు అందించడంతో బ్లూమ్‌బర్గ్‌ ఎల్ పి అత్యంత ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే. మైకేల్‌ బ్లూమ్‌బర్గ్‌ 1981 లో బ్లూమ్‌బర్గ్‌ ఎల్ పి స్థాపించారు. 2019లో బ్లూమ్‌బర్గ్‌ రాబడి రూ 70,000 కోట్ల ఉంటుందని బర్టన్‌ టేలర్‌ ఇంటర్నేషనల్‌ కన్సల్టింగ్‌కు చెందిన ఓ అనలిస్ట్ తెలియచేసారు.