ఇండియా మహిళా టీం కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితంపై సినిమా రానుంది. ఈ బయోపిక్ కు ‘శబాష్ మిథు’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఇక మిథాలీ రాజ్ పాత్రలో నటి తాప్సి నటించబోతుంది. ఈ రోజు మిథాలీ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్నీ తాప్సి సోషల్ మీడియాల్ ద్వారా పంచుకుంది.

హ్యాపీ బర్త్ డే మిథాలీ రాజ్. మమ్మల్ని ఎన్నోవిధాలుగా గర్వపడేలా చేసావ్. నీ జీవిత ప్రయాణాన్ని నాకు తెరపై చూపించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. ఈ బయోపిక్ లో నా రూపంలో నిన్ను నువ్వు చూసుకుని గర్వపడతావని మాత్రం చెప్పాగలనని ట్వీటర్లో పోస్ట్ చేసింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •