కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో అనేక మంది ఉపాధి కోల్పోయారు. మరి ముఖ్యంగా వలస కార్మికులు జీవనోపాధిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. చేతిలో డబ్బులు లేక తినడానికి సరైన తిండి లేక అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారు. అయితే ముంబైలో నివసించే ఓ కార్మికుడు ఇంటి దగ్గర జీవనాధారంగా ఉండే పశువులను అమ్మి తన సొంత ఊరు వెళ్ళడానికి విమాన టికెట్స్ కొన్నాడు. అయినాసరే వెళ్లలేక పోయాడు.

ముంబైలో చిక్కుకుపోయిన ముగ్గురు వలస కార్మికులు పశ్చిమ బెంగాల్ లోని సొంత ప్రాంతం ముర్షిదాబాద్ కు వెళ్లాలనుకున్నారు. ప్రభుత్వం రైళ్లు ఏర్పాటు చేసినా కూడా వారికి టికెట్స్ దొరకలేదు. ఇక ఎలాగైనా తమ సొంతూరికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఓ కార్మికుడు తమ దగ్గరున్న పశువులను అమ్మి విమాన టికెట్స్ కొనుగోలు చేసాడు. మిగతా వారు వివిధ మార్గాల్లో డబ్బును సమకూర్చుకున్నారు.

ఇక మే 25న ఇండిగో విమానంలో ప్రయాణించేలా వారు టికెట్స్ కొనుగోలు చేశారు. కానీ విమానం రద్దు కావడంతో వారి ఆశకు గండిపడింది. అంతేకాకుండా వారి టికెట్ సొమ్ము కూడా వెనక్కి రాలేదు. ఇక చేసేదేమి లేక దీంతో వారు విమానాశ్రయానికి చేరుకొని ఆందోళన చేశారు. ఇక వీరి సమస్య ఇండిగో విమాన సంస్థకి తెలియడంతో వారు ట్విట్టర్ ద్వారా స్పందించారు. వీరి సమస్య తమ దృష్టికి వచ్చిందని.. వీరికి జూన్ 1న టికెట్స్ బుక్ చేశామని ఇండిగో తెలియచేసింది. దీంతో ఆ కార్మికులు సంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణలో భారీగా వ్యాపిస్తున్న కరోనా.. ఒక్కరోజే 108 పాజిటివ్ కేసులు..!

వ్యభిచారం కేసులో అడ్డంగా దొరికిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్