వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఆర్కేకు వైసీపీ తరుపున టికెట్ లేదన్న కారణంతో, ఆర్కే అలిగి అజ్ఞాతంలోకి వెళ్లాడని ప్రముఖ మీడియా చానెల్స్ లో పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. ఆర్కే గత నాలుగు రోజుల అజ్ఞాతం తరువాత ఈరోజు బయటకు వచ్చి మీడియా సమావేశంలో తన అజ్ఞాతవాసానికి సంబంధించి కారణాలు తెలియచేసారు.

తాను ఒక కేసు విషయమై గత నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నానని, కానీ తన అనుచరులు లోటస్ పాండ్ వద్దకు వచ్చి గొడవ చేశారన్న విషయం తనకు తెలియదని, వచ్చే ఎన్నికలలో తనకు వైఎస్ జగన్ టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా నేను జగన్ సైనికుడిని అని తేల్చి చెప్పారు. తనకు టికెట్ రావడం లేదని కొంత మంది కౌన్సిలర్లు చేసిన రాజీనామా వెనక్కు తీసుకోవాలని ఇప్పటికే తాను వారిని కోరానని, వచ్చే ఎన్నికలలో ఎవరకి టికెట్ ఇచ్చినా ఒక కార్యకర్తగా వైసీపీ పార్టీ కోసం కష్టపడతానని తెలియచేసారు.