2014 ఎన్నికలలో ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత నారా లోకేష్ కీలక నేతగా ఎదిగారు. మంత్రి వర్గంలో కీలకమైన మూడు శాఖలను నిర్వహించడంతో పాటు పార్టీలో రాబోయే తరాలకు కాబోయే సీఎం అన్నట్లు… చంద్రబాబు నాయుడు… లోకేష్ బాబును ప్రోజెక్టు చేసారు. ఎంతైనా లోకేష్ బాబు కన్న కొడుకు కావడంతో పార్టీపై అవగాహన లేకపోయినా చంద్రబాబు నాయుడుకి మమకారం ఉండవచ్చు. 

కానీ గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీతో పాటు తన ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేసారు. దీనికి కారణం చెబుతూ లోకేష్ వల్ల తాను పార్టీలో చాల ఇబ్బంది పడ్డానని… లోకేష్ తెలుగుదేశం పార్టీని కొంప ముంచుతున్నాడని, ప్రతి నియోజకవర్గంలో వర్గాలను ఏర్పాటు చేసి పార్టీని నిలువునా ముంచేస్తున్నాడని అన్నారు… లోకేష్ వలనే తాము ఎన్నికలలో ఓడిపోయామని… అసలు పార్టీ గురించి… పార్టీ సంస్థాపన గురించి లోకేష్ కు ఏమి తెలియదని… కానీ లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిగా, కాబోయే సీఎంగా చంద్రబాబు నాయుడు చెప్పడం అవివేకమని… టీడీపీలో లోకేష్ సారధ్యంలో మనుగడ కష్టమని అందుకే పార్టీ వదిలి వెళ్తున్నట్లు వ్యాఖ్యలు చేసారు.

లోకేష్ పై అన్నం సతీష్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు…తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండే ప్రతి నేత చెబుతూనే ఉంటారట. లోకేష్ బాబు ఎప్పుడు సీనియర్స్ కు గౌరవం ఇవ్వకపోగా, గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారిపై లోకేష్ తన వ్యక్తుల చేత నిఘా పెట్టించి అంతా తన కనుసన్నలలో జరిగేలా చూసుకునేవాడట. లోకేష్ చేస్తున్న పనుల వలన సీనియర్ నాయకులు చాల మంది ఇబ్బంది పడటంతో పాటు చంద్రబాబు నాయుడుకి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకునేవారు కాదట. పార్టీని వచ్చే రోజులలో నడిపేది లోకేష్ అని అయన కిందనే మీరు పనిచేయాలని కూడా అనేవారట. సుజనా చౌదరి కూడా పార్టీ మారుతూ లోకేష్ బాబు మీదనే కీలక వ్యాఖ్యలు చేసి వెళ్లారు. దీనితో లోకేష్ బాబు చేస్తున్న పనులపై తెలుగుదేశం పార్టీలో మరోసారి పెద్ద చర్చగా మారింది. ఇక అన్నం సతీష్ కుమార్ బాటలో లోకేష్ బాబు బాధితులు చాలా మంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని గుసగుసలు వినపడుతున్నాయి.   

 




  •  
  •  
  •  
  •  
  •  
  •