రిలయన్స్ జియో వచ్చిన తరువాత దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని గిరిజన ప్రాంతాలు తప్ప దాదాపుగా అన్ని ప్రాంతాలలో ఇంటర్ నెట్ సేవలు కల్పించడానికి ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థ ముమ్మర ప్రయత్నాలు చేస్తూ, దేశంలోని మొబైల్ రంగంలో 50 శాతం తన సంస్థే ఉండేలా పావులు కదపుతుంది. అందులో భాగంగా సెప్టెంబర్ 5వ తేదీన బ్రాండ్ బ్యాండ్ సేవలు కూడా మొదలు పెట్టి మరింత విస్తరణకు దారులు వెతుకుతుంది. ముకేశ్ అంబానీ చెబుతూ భారత్ లో మొదటిసారి జియో బ్రాడ్ బ్యాండ్ ద్వారా 100 మెగాబిట్ స్పీడ్ తో తమ సేవలు మొదలు పెడుతున్నామని గొప్పగా చెప్పుకుంది. 

కానీ ప్రపంచంలో ఉన్న మొబైల్ రంగంలో భారతదేశం ఇంటర్నెట్ స్పీడ్ లో 140 దేశాలలో 126వ స్థానంగా ఉంది. 2017 నుంచి 2019 జులై మధ్యలో ఇండియాలో ఇంటర్నెట్ స్పీడ్ 16.3 పెరుగుదల నమోదు కాగా, మొబైల్ స్పీడ్ 28.5 పెరుగుదల నమోదు చేసుకుంది. ఈ వివరాలను స్పీడ్ టేస్ట్ కు సంబంధించి Ookla సంస్థ వెల్లడించింది. జియో వచ్చిన తరువాత ఇంటర్నెట్ వేగంలో మార్పులు రావడంతో స్పీడ్ కొద్దిగా పెరుగుదల స్థానాన్ని నమోదు చేసుకున్నట్లు కనపడుతుంది. 

  •  
  •  
  •  
  •  
  •  
  •