న్యూజిలాండ్ బౌలర్ల దాటికి భారత బ్యాట్సమెన్ చేతులెత్తేశారు. మొదటి రోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. మొదటి రోజు 122 రన్స్ చేసి 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. ఇక రెండవ రోజు మొదటి గంటలోనే అల్ అవుట్ అయ్యింది. తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో 165 పరుగులకే చేతులెతేసింది. ఇక బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం 50 ఓవర్లకు 160 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. కివీస్ కెప్టెన్ విలియ‌మ్‌స‌న్ 72 పరుగులు, టేలర్ 44 పరుగులతో బరిలో ఉన్నారు.