ఈరోజు ప్రధాని మోదీ పుట్టినరోజు కావడంతో ఉదయం నుంచి ట్విట్టర్ లో ప్రధానికి శుభాకాంక్షలు చెబుతూ దేశవ్యాప్తంగా మోత మోగించేస్తున్నారు. ఇక మోదీకి ఎవరైతే ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్పారో వారికి తిరిగి కృతజ్ఞతలు చెబుతున్నారు. వీరిలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు బాలీవుడ్ సెలెబ్రేటిస్ ఇలా అనేక రంగాల వారికి తిరిగి కృతజ్ఞతలు చెబుతున్నారు. కానీ అందరకి రిప్లై ఇస్తున్నారు తప్ప ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మాత్రం ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు.

చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీని పరుష పదజాలంతో తిడుతూ, ప్రధాని కుటుంబాన్ని కూడా లాగి తిట్టిన తిట్లు మోదీ ఎప్పటికి మర్చిపోయే అవకాశం లేదు. అవకాశవాద రాజకీయాల కోసం బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నాయుడు తన కుతంత్రాన్ని చూపించాడు. కానీ మరోసారి బీజేపీ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రావడంతో చంద్రబాబు ఫ్లేట్ ఫిరాయించి మోదీజీ జై అన్నాడు. కానీ బీజేపీ వారు మాత్రం చంద్రబాబుని లెక్కచేసే పరిస్థితి లేదు. చివరకి తనకు భద్ర శత్రువుగా భావించే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా రిప్లై ఇచ్చి, మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుకి రిప్లై ఇవ్వలేదంటే, చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీపై ఎలాంటి కుట్రలు కుతంత్రాలు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు చేసాడో గమనించవచ్చు.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే జనసేన పార్టీ ఇప్పుడు బీజేపీతో కలసి పొత్తులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుకు వెళ్తున్నా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా కాస్త ఘాటుగానే ఉన్నాయి. దీనితో పాటు జనసేన పార్టీ నిలబడిన అన్నిచోట్ల తుక్కు తుక్కుగా ఓడిపోవడంతో పాటు పవన్ కళ్యాణ్ ఏకంగా తాను పోటీ చేసిన రెండు చోట్ల బారి మెజారిటీతో ఓడిపోవడంతో అతడిని లెక్కచేయవల్సిన పరిస్థితి లేదని బీజేపీ అగ్రనాయకత్వం కూడా భావిస్తుంది.

బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఇప్పటికి పవన్ కళ్యాణ్ తమతో కలసి ప్రయాణం చేస్తున్నా చంద్రబాబు నాయుడు జేబులో మనిషని అతడు ఎలా చెబితే అలా నడుచుకోవడంలో సిద్ధహస్తుడని బావించడంతోనే అతడి గురించి పెద్దగా లెక్కలోకి తీసుకుంటుండటం లేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను బీజేపీ నాయకత్వానికి లాయలిస్ట్ అని చెప్పుకోవడానికి బీజేపీకి చెందిన గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లెవల్ లో ఉన్న అందరి ట్వీట్స్ రీట్వీట్స్ చేస్తూ తనను గుర్తించమని ఎప్పటికప్పుడు కోరుతూనే ఉన్నాడు.

కలసి ప్రయాణం చేస్తా అని వెంపర్లాడాడు సరే వచ్చిన వాడిని కాదనుకోవడం ఎందుకని అతడితో కలసి ముందుకు వెళ్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఎంత దూరం పెడుతున్నారో చెప్పడానికి ఒకే ఒక్క నిదర్శనం… జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి ఇంతవరకు పవన్ కళ్యాణ్ కు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. కానీ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మాత్రం కుశల ప్రశ్నలు వేసుకోవడానికి ప్రధానితో సరదాగా ఒక అరగంట సేపు గడిపివచ్చారు.