ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇతర పార్టీల నుండి వైసీపీలోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి టీడీపీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

కాగా ఈ క్రమంలో మోదుగులను జగన్ టీడీపీ కంచు కోట అయిన గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గం నుండి బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న దూళిపాళ్ల నరేంద్ర మీద ప్రజలలో తీవ్ర వ్యతిరేఖత ఉంది. ఆయన వరుసగా 5 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అక్కడ మోదుగులను వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దించితే నరేంద్రకు చిక్కులు తప్పవంటున్నారు వైసీపీ నేతలు.

గుంటూరులో మోదుగుల మంచి పేరు ఉంది ఆయన గత ఎన్నికలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలుపొందారు. అలాగే 2009 ఎన్నికలలో నరసారావు పెట్ నుండి టీడీపీ ఎంపీ గా పోటీ చేసి గెలుపొందారు. దీనితో టీడీపీ కంచు కోటగా ఉన్న పొన్నూరు నుండి మోదుగులను దించితే హోరాహోరీ పోరు తప్పదంటున్నారు.