ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ కోతి మినీ బైక్ పై వచ్చి ఓ చిన్నారిని కిడ్నాప్ చేయబోయింది. బలవంతంగా ఆ చిన్నారిని లాకెళ్లేందుకు ప్రయత్నించింది. వివరాలలోకి వెళ్తే.. రోడ్డు పక్కన కొంత మంది చిన్నారులు బెంచిపై కూర్చుని ఉన్నారు. ఈ క్రమంలో మినీ బైక్ పై వేగంగా వచ్చిన ఓ కోతి ఆ చిన్నారిని లాకెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ చిన్నారి కింద పడ్డాడు. అయినా ఆ కోతి ఆ చిన్నారిని వదలలేదు. చొక్కాను పట్టుకుని లాకెళ్లే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన స్థానిక వ్యక్తి వెంటనే కోతిని తరమడంతో ఆ చిన్నారిని వదిలేచి పారిపోయింది.

ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియోను ప్రముఖ బాస్కెట్ బాల్ ప్లేయర్ రెక్స్ చాప్మన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇక ఈ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది.