ప్రస్తుతం బీజేపీ పార్టీ అద్భుతమైన మెజారిటీతో సింగల్ లార్జెస్ట్ పార్టీగా తన మిత్రుల సహకారం లేకుండా అధికారాన్ని కైవసం చేసుకుంది. మోదీ ఈసారి ఏకచత్రాధిపత్యంతో దేశ ప్రజలు ఎన్నుకోవడంతో రెండవసారి వరుసగా ప్రధాని పగ్గాలను మోదీ చేపట్టారు. మోదీ రెండవసారి వచ్చిన తరువాత కాశ్మీర్ అంశానికి ఒక పరిష్కారం చూపిస్తూ ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిరానికి సంబంధించి ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసుకు ముగింపు పలకడం ఇలా ప్రతి విషయంలో తన స్పష్టమైన వైఖరి తెలియచేస్తూ ఉన్నారు.

ఇక వచ్చే ఎన్నికలలో మీరు ప్రధానిగా ఎవరని కోరుకుంటున్నారని “మూడ్ అఫ్ ది నేషన్ పేరుతో సర్వే నిర్వహించగా మోదికి మరోసారి జై కొడుతూ ప్రజలు ఏకంగా 53 శాతం ఓటు వేశారు. ఇక రాహుల్ గాంధీ ప్రధాని కావాలని 13 శాతం కోరుకోగా, సోనియా గాంధీ ప్రధాని కావాలని 7 శాతం మంది అభిప్రాయం పడ్డారు. ఇక హోమ్ మంత్రి అమిత్ షా ప్రధాని కావాలని కేవలం నాలుగు శాతం మందే సర్వేలో తమ నిర్ణయం తెలియచేయడం విశేషం. దేశ వ్యాప్తంగా సీఏఎ, ఎన్ఆర్సీకు సంబంధించి గొడవలు జరుగుతున్న ప్రజలు మరోసారి మోదీ వైపే నిలిచారని ఏ సర్వే స్పష్టం చేస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •