ఉదయాన్నే లెగవగానే బెడ్ కాఫీ తాగితే ఆ కిక్కే వేరని కొంతమంది భావిస్తుంటారు. ఇక కాఫీ తాగడం వలన రోజంతా వారి జీవక్రియలో కిక్ వస్తుందని భావించేవారు కూడా ఎక్కువే. ఆఫీసులలో గంటకొకసారి కాఫీ తాగే వారి సంఖ్య లెక్కలేనంత. కానీ ఇలాంటి వారు ఇక నుంచి కాఫీ తాగాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసిన పరిస్థితి ఉందని యూకేకు చెందిన ఒక సంస్థ వెల్లడించింది.

రోజు మొత్తంలో 6 కన్నా ఎక్కువ సార్లు కాఫీ తాగితే ఆరోగ్యానికి హానికరమని, మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని 22.5 శాతం పెంచుతుందని, అలానే అధిక రక్తపోటుకి కూడా దోహద పడుతుందని ఒక అధ్యయనం చెబుతుంది. వీరు అధ్యయనం చేసేటప్పుడు “యూకే బయో బ్యాంకు” నుంచి వచ్చిన డేటాను ఉపయోగించుకొని ఈ వివరాలు అందచేశారు. దాదాపుగా 37 నుంచి 73 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన 3,50,000 వేల మందిపై పరిశోధనలు చేసి ఈ వివరాలు వెల్లడించారు. మితంగా కాఫీ తాగితే మంచిదేనని, అతిగా తాగే వారు మాత్రం ఒకసారి మీ గుండెను చెక్ చేయించుకోవడం ఉత్తమమని తెలుస్తుంది.             

  •  
  •  
  •  
  •  
  •  
  •