మోటరోలా జి సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 25న విడుదల చేసింది. బడ్జెట్ ధరల్లో జి8 ప్లస్ ను తీసుకొచ్చిన మోటరోలా.. కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ పింక్ ధరల్లో వాటిని విడుదల చేసింది. అక్టోబర్ 29 నుండి ఫ్లిప్ కార్ట్ ద్వారా లభ్యం కానుంది. కొనుగోలుదారులకు 3 వేల క్లియర్ ట్రిప్ కూపన్, 2 వేల జూమ్ కార్ వోచర్, 2200 తక్షణ క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తాయి. దీని ధర రూ.13,999.

మోటో జి8 ప్లస్ ఫీచర్లు:
6.3 అంగుళాల ఫుల్ హెచ్ డి
4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్, 512 వరకు విస్తరించుకునే అవకాశం
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
త్రిబుల్ రియర్ కెమెరా 48 +16 ఎంపీ అల్ట్రా వైడ్, 5 ఎంపీ డెప్త్ సెన్సర్
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 9 పై క్వాల్ కోమ్, స్నాప్ డ్రాగెన్ 665 ప్రాసెసర్