తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్ర పరిశ్రమకు గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ మొదటి వారం నుండి షూటింగ్ లు మొదలు పెట్టుకోవచ్చని తెలిపారు. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, రాజమౌళి, దిల్ రాజు, సురేష్ బాబు, త్రివిక్రమ్ సీఎం కేసీఆర్ ను కలిశారు.

ఈ సందర్భంగా సినిమా పరిశ్రమ ఎదుర్కుంటున్న ఇబ్బందులను ఆర్ధిక కష్టాలను సీఎం కు వివరించారు. షూటింగ్ లు రిలీజ్ లకు అనుమతులు ఇవ్వలని సినీ పెద్దలు కేసీఆర్ కు విన్నవించారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని సీఎం వారికి సూచించారు. దీనిపై పూర్తి విధివిధానాలను ప్రభుత్వం ప్రకటిస్తుందని.. వాటికి అనుగుణంగా నడుచుకోవాలని కేసీఆర్ తెలియచేసారు.

గుడ్ న్యూస్.. సెప్టెంబర్‌లో కరోనా వ్యాక్సిన్..!

ఊపిరిపీల్చుకున్న చిత్ర యూనిట్.. రెండు నెలలు తర్వాత ఇండియాకు..!