ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్ది సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతుంది. గత వారం విడుదలైన “ఎన్టీఆర్ బయోపిక్” ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు చేసాయి. ఇక ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రపైనే ఇప్పుడు చర్చోప చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు పాత్రను తెలుగుదేశం పార్టీ కోసం ఎంతలా కష్టపడి పైకి తీసుకువచ్చాడన్న రీతిలో చూపించడానికి దర్శకుడు చాల వరకు ప్రయత్నాలు చేసాడట.

తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో చంద్రబాబు నాయుడు తమ మామయ్య ఎన్టీఆర్ ను విభేదించి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరిన సన్నివేశం కూడా ఉంటుందట. అసలు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని వదలి తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరవలసి వచ్చిందో కాస్త చెప్పే ప్రయత్నం చేశారట. ఇక సినిమాలో మరొక కీలక ఘట్టంగా ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడిచి తాను ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించినప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అందరిని రైలులో ఢిల్లీ తీసుకొని వెళ్లి పెరేడ్ నిర్వహించే సమయంలో మార్గ మధ్యలో ఎమ్మెల్యేలను కిడ్నప్ చేయడానికి కొంత మంది దుండగులు ప్రయత్నిస్తారట. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు పాత్రదారుడైన రానా దుండగుల నుంచి ఎమ్మెల్యేలను విడిపించి ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకొని వెళ్లి తెలుగువాడి పౌరుషాన్ని చూపించే విధముగా ఆ సీన్ తయారు చేశారట. సినిమాలలో ఆ సీన్ హైలెట్ గా ఉంటుందని, ఎమ్మెల్యేలను కాపాడే సన్నివేశంలో ఫైటింగ్ కూడా చంద్రబాబు నాయుడు పాత్రధారి చేస్తాడని తెలుస్తుంది. సినిమా మొత్తం మీద ఫైటింగ్ సీన్ అది ఒక్కటే ఉంటుందని తెలుస్తుంది..

ఈ సినిమా పూర్తిగా చంద్రబాబు నాయుడుని ఎలివేట్ చేయడానికే తీసారని, చంద్రబాబు నాయుడు అవసరం తెలుగుదేశం పార్టీకి ఎంత ఉందో తెలియచెప్పేలా చంద్రబాబు పాత్రను తీర్చిదిద్దారని తెలుస్తుంది. ముందుగా చిత్రాన్ని మొదలు పెట్టే ముందు చంద్రబాబు నాయుడు దగ్గరకు చిత్ర యూనిట్ వెళ్లి, కథను వినిపించి తన ఆమోదంతోనే సినిమాను నిర్మించినట్లు చెబుతున్నారు. “ఎన్టీఆర్ బయోపిక్” చిత్రంలో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఒక్క సీన్ కూడా లేకుండా సినిమా ఆధ్యంతం బాబు గారి నామస్మరణలోనే ఎన్టీఆర్ కు చంద్రబాబు నాయుడు అంటే ఎంత ఇష్టమో చెప్పే ప్రయత్నం చేస్తూ, కొంత మంది కుట్ర స్వార్ధ రాజకీయాల వలనే ఎన్టీఆర్ పార్టీకి దూరం కావలసి వచ్చిందన్న రీతిలో సినిమాను నిర్మించి, రాబోయే ఎలక్షన్స్ కు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడేలా తీసినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది.